కరీంనగర్ యూనియన్ బ్యాంకులో 12 కోట్లు స్కామ్ - MicTv.in - Telugu News
mictv telugu

కరీంనగర్ యూనియన్ బ్యాంకులో 12 కోట్లు స్కామ్

March 15, 2019

దేశీయ బ్యాంకుల్లో కుంభకోణాలు వెలుగుచూడడం సర్వసాధారణం అయిపోయింది. బ్యాంకు కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో జరిగిన ఓ కుంభకోణం కలకలం రేపుతోంది. ఆ బ్యాంకులో చెస్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సురేశ్ కుమార్ ప్రైవేట్ వ్యక్తులకు రూ.12 కోట్ల మేర డబ్బును అప్పుగా ఇచ్చాడు. ఈ విషయం ఉన్నతాధికారుల తనిఖీల్లో వెల్లడైంది. దీనితో సురేశ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తామని కరీంనగర్ పోలీసులు తెలిపారు.

Rs 12 crore scam exposed in Karimnagar union bank of Indian

ఇప్పటికే వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఐపీఎల్ సిద్ధాంతకర్త లలిత్ మోదీ, లిక్కర్ కింగ్ విజయ మాల్యా తదితర బడా వ్యాపారులు దేశీయ బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణాలు ఇలాగే కొనసాగితే బ్యాంకులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని పలువురు ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. ఈ తరహా ఆర్థిక నేరగాల్లాకు కఠిన శిక్షలు విధించి ప్రజలకు బ్యాంకులపై ఉన్న నమ్మకాన్ని పునరుద్దరించాలని కోరుతున్నారు.