రూ.14 కోట్ల 87 లక్షల కారుకు యాక్సిడెంట్..రొనాల్డో క్షేమమే - MicTv.in - Telugu News
mictv telugu

రూ.14 కోట్ల 87 లక్షల కారుకు యాక్సిడెంట్..రొనాల్డో క్షేమమే

June 21, 2022

పోర్చుగల్‌ దేశానికి చెందిన ప్రముఖ ఫుట్‌బాల్‌ స్టార్‌ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 1.8 యూరో మిలియన్‌ల విలువైన (భారత్ కరెన్సీ రూ. 14 కోట్ల 87 లక్షలు) బుగట్టి వెయ్రోన్ సూపర్‌ కారు మేజర్‌ యాక్సిడెంట్‌కు గురయ్యింది. దాంతో క్రిస్టియానో రొనాల్డో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. ఆ ప్రమాదంలో రొనాల్డోకు ఏమైనా గాయాలు అయ్యాయా? ఏం జరిగింది? అనే టెన్షన్ మొదలైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులు తాజాగా వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ కారులో క్రిస్టియానో రొనాల్డో లేడని, అతడు క్షేమంగానే ఉన్నట్లు వివరాలను వెల్లడించారు.

”సోమవారం స్పెయిన్‌లోని రొనాల్డో నివాసం ముందే కారు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్‌ జరిగినప్పుడు మొదట రొనాల్డో కారులోనే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఫుట్‌బాల్‌ స్టార్‌ ప్రస్తుతం హాలిడే గడపడానికి అతని ఫ్యామిలితో ఒక ఐలాండ్‌లో ఉన్నాడు. రొనాల్డో కారును అతడి డ్రైవర్‌ తీసుకెళ్లాడు. కారును కంట్రోల్‌ చేయడంలో పట్టు కోల్పోవడంతో రొనాల్డో ఇంటి ముందున్న గోడను బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ, కారు ముందు భాగం మాత్రం​ బాగా దెబ్బతింది.” అని వెల్లడించారు.

అయితే, సమాచారం అందుకున్న పోలీసులు కారును ఆటోగ్యారెజ్‌కు తరలించారు. రొనాల్డో ఎంతో ఇష్టపడి కొనుకున్న కారు రిపేరుకు సంబంధించిన బిల్‌ పెద్దదిగానే ఉండనుందని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఏ ఇతర వాహనము కారును యాక్సిడెంట్‌ చేయలేదని, డ్రైవర్‌ తనంతట తానుగానే పట్టు తప్పడంతో కారుకు యాక్సిడెంట్‌ అయిందని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలుపడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.

క్రిస్టియానో రొనాల్డోకు.. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రొనాల్డోకు కార్లంటే తెగ ఇష్టం. మార్కెట్లో విడుదలైన ప్రతి కారును కోనుగోలు చేస్తుంటాడు. దాంతో తన ఇంట్లోనే దాదాపు అన్ని మోడల్స్‌కు సంబంధించిన కార్లను కలిగి ఉన్న వ్యక్తిగా పేరుగాంచాడు. తాజాగా రొనాల్డోకు సంబంధించిన కోట్ల విలువైన బుగట్టి వెయ్రోన్ సూపర్‌ కారు మేజర్‌ యాక్సిడెంట్‌కు గురికావడంతో సంచలనంగా మారింది.