మార్లిన్ మన్రో ఫోటోకు రూ.1521 కోట్లు!.. ఏందీ రా బాబు - MicTv.in - Telugu News
mictv telugu

మార్లిన్ మన్రో ఫోటోకు రూ.1521 కోట్లు!.. ఏందీ రా బాబు

March 23, 2022

fhfthn

మార్లిన్ మన్రో తెలియని సినీ అభిమానులు ఉండరు. ఒకవేళ ఆమె ఎవరో తెలియకపోయిన, ఆమె నటించిన సినిమాలను చూడకపోయిన ఆమె ఫోటోను చూస్తే మాత్రం గుర్తుపడతారు. అలాంటి మార్లిన్ మన్రోకు సంబంధించిన ఓ పెయింటింగ్‌ కోన్ని కోట్లు రూపాయలు పలుకుతుంంది. మరి ఆ పెయింంటింగ్ ఏంటీ? ఎవరు వేశారు? ఎన్ని కోట్లకు అమ్ముడుపోతుంది? అనే వివరాల్లోకి వెళ్తే..‌ మార్లిన్ మన్రో 1926 జూన్ 1న జన్మించి, 1962లో మరణించింది. అయినా ఇప్పటికీ ఆమె వాడిన ప్రతి వస్తువు వేలంలో భారీ ధరలకు అమ్ముడుపోతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆమె లెటర్స్ దగ్గర నుంచి వస్తువుల వరకూ లక్షలు పలికాయి. తాజాగా క్రిస్టీ సంస్థ మార్లిన్ పెయింటింగ్‌‌ను మే నెలలో వేలానికి పెట్టనుంది. మార్లిన్ చిత్రాన్ని పాప్ గాయకుడు ఆండీ వార్హోల్ గీశారు. ఈ పెయింటింగ్‌కు రూ.1521 కోట్లు పలుకుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. నిజంగా ఇంత ధరకు ఆ పెయింటింగ్ అమ్ముడుపోతే 20వ శతాబ్దంలోనే అతి ఖరీదైన చిత్రంగా చరిత్రలో నిలుస్తుందని క్రిస్టీ సంస్థ వెల్లడించింది.

మరోపక్క ఆమె నవ్వు కోసం అభిమానులు అప్పట్లో పడిచచ్చేవారట. అయితే, సినిమాల్లో నటించి ఎన్నో పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించిన ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి. ఆమె వివాహా
లు, ఆమె చేసిన కామెంట్లు ఎన్నో సంచలనం కూడా అయ్యాయి. మోడల్‌గా సినిమా నటి అగ్రస్థానానికి చేరుకున్న ఆమె 36 ఏళ్ల వయస్సులో అనుమానాస్పద స్థితిలో ఆమె చనిపోయింది. ఆమెను ఎవరో చంపేశారనే కథనాలు అనేకం ఉన్నాయి.