రూ.1,526 కోట్ల హెరాయిన్ పట్టివేత: డీఆర్ఐ, ఐసీజీ - MicTv.in - Telugu News
mictv telugu

రూ.1,526 కోట్ల హెరాయిన్ పట్టివేత: డీఆర్ఐ, ఐసీజీ

May 21, 2022

కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ తీరంలో పడవల్లో అక్రమంగా తరలిస్తున్న 218 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, భారత తీర రక్షక దళం అధికారులు తెలిపారు. ‘ఆపరేషన్ ఛైజీన్’ పేరుతో సముద్రం తీరంలో చేపట్టిన ఆఫరేషన్‌లో కిలో ప్యాకెట్ల చొప్పున రెండు బోట్లను తనిఖీ చేయగా.. 218 పొట్లాలు దొరికినట్లు అధికారులు పేర్కొన్నారు.

అధికారులు మాట్లాడుతూ..”’ఆపరేషన్ ఛైజీన్’ పేరుతో భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఆఫరేషన్‌ను డీఆర్ఐ, ఐసీజీ కలయికలో సంయుక్తంగా దాడులు చేశాం. రెండు పడవలను తనిఖీ చేశాం. అందులో అక్రమంగా తరలిస్తున్న కిలో ప్యాకెట్ల చొప్పున రెండు బోట్లలో కలిపి 218 పొట్లాలు దొరికాయి. ఈ డ్రగ్స్ విలువ మార్కెట్లో సుమారు రూ.1,526 కోట్లు ఉంటుంది. పడవలో ఉన్న పలువురిని అరెస్టు చేసి, పడవలను కొచ్చికి తరలించాం. గత రెండు నెలల వ్యవధిలో దేశంలో భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలు పట్టుబడటం ఇది నాలుగోసారి. ఏప్రిల్ నుంచి 8,800 కిలోలకు పైగా హెరాయినను స్వాధీనం చేసుకున్నాం” అని డీఆర్ఐ అధికారులు తెలిపారు. అనంతరం పట్టుబడిన మొత్తం సరుకు విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.26,000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.