త్వరలో రూ. 200 నోటు! - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో రూ. 200 నోటు!

August 23, 2017

దేశంలో తొలిసారిగా రూ. 200 నోట్లు మార్కెట్లో చక్కర్లు కొట్టనుంది. ఈ నెలాఖరుర్లోగాని, లేదా వచ్చే నెల తొలివారంలోగాని 200 నోటును ప్రవేశ పెట్టడానికి ఆర్బీఐ కసరత్తు చేస్తోంది.

‘ప్రస్తుతం రూ. 100, రూ. 500 నోట్ల మధ్య ఆ నోట్లు తప్ప మరో డినామినేషన్ నోట్లు అందుబాటులో లేవు. దీంతో చిల్లర సమస్య తలెత్తుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ త్వరలో రూ. 200 నోట్లను తీసుకురావడానికి యత్నిస్తోంది. వీటికి ఎంతో ఆదరణ లభిస్తుంది’’ అని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

అయితే ఆర్బీఐ దీనికి సంబంధించి వివరణ ఇవ్వేదు. నల్లధనం, నకిలీ కరెన్సీని అరికట్టడానికి మోదీ ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసి కొత్త రూ. 500, రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టడం తెలిసిందే. రూ. 2000 నోటుకు చిల్లర దొరక్క ప్రజలు అల్లాడుతున్న నేపథ్యంలో కొత్త రూ. 200 రాకతో కాస్త ఉపశమనం కలగనుంది.

మార్కెట్లోకి రానున్న 200 నోటు ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. అయితే దీన్ని ప్రభుత్వం ఇంకా ధ్రువీకరించలేదు.