హైదరాబాద్‌లో 3 కోట్ల చోరీ.. నేపాలీ వాచ్‌మెన్ పనే!  - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో 3 కోట్ల చోరీ.. నేపాలీ వాచ్‌మెన్ పనే! 

August 3, 2020

Rs 3 crore theft in Hyderabad .. Nepali watchmen are working!.

రిస్క్ చేసి వేరే ఇళ్లల్లో ఎందుకు చోరీ చేయాలి? పనిచేసే ఇంటికే భారీగా కన్నం వేద్దామని భావించాడు ఆ దొంగ. పైగా తాను ఆ ఇంటి వాచ్‌మెన్‌ను కాబట్టి ఎవరికీ ఏ అనుమానం రాదని అనుకుని పథకం ప్రకారం దొంగతనానికి పాల్పడ్డాడు. యజమాని ఇంట్లో దాదాపు రూ.3 కోట్ల విలువ చేసే బంగారం, వెండి, నగదును దోచేశాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నరసింహారెడ్డి   కుటుంబ సభ్యులు కుమారుడి వివాహ నేపథ్యంలో షిరిడీ వెళ్లారు. అదే అదనుగా భావించిన సదరు దొంగ చోరి చేశాడు. నేరేడ్‌మెట్‌లోని సైనిక్‌పురి కాలనీలో ఆదివారం అర్ధరాత్రి ఈ చోరీ జరిగింది. 

అయితే కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికి వచ్చిన బంధువుల ఆభరణాలు కూడా చోరికి గురైనట్లు సమాచారం. ఈ పని చేసింది వాచ్‌మెన్ అని ఇంటి యజమాని భావించారు. అతనిది నేపాల్‌ అని తెలిపారు. నిందితుడు చోరీ అనంతరం ఇంట్లో ఉన్న స్కూటీ మీద వెళ్లి దానిని రెండు కిలోమీటర్ల దూరంలో వదిలేసి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు  కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, వాచ్‌మెన్ ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా ముమ్మరంగా అతనికోసం గాలిస్తున్నారు. నేపాల్‌కు చెందిన అతని పేరు భీమ్ అని.. కొద్దిరోజుల క్రితం వాచ్‌మెన్‌గా చేరాడని పోలీసులు తెలిపారు. చోరీ అనంతరం అతడు కనిపించకపోవడంతో అతడిపైనే అనుమానాలు ఉన్నాయని పోలీసులకు చెప్పారు.