Rs 38 will be deducted from the salary of railway employees for Tiranga
mictv telugu

హర్ ఘర్ తిరంగా.. రైల్వే ఉద్యోగుల జీతాల నుంచి జెండా ఖర్చుల కోత!

August 7, 2022

 

రైల్వే ఉద్యోగులకు ఇచ్చే జాతీయ జెండాల కోసం కేంద్ర ప్రభుత్వం వారి జీతాల నుంచి రూ. 38 కోత విధించాలని నిర్ణయం జరిగింది. హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‌లో భాగంగా రైల్వే ఉద్యోగులకు ఒక్కో జెండా చొప్పున అందిస్తున్నారు. ఆ జెండా కోసం డబ్బును వారి వేతనాల నుంచి కోత కోయనున్నట్టు రైల్వే సీపీఆర్‌వో శివమ్ శర్మ తెలిపారు. అయితే, ఈ నిర్ణయాన్ని రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకించింది.

జాతీయ జెండాలను రైల్వే ఉద్యోగులకు ఓ ప్రైవేట్ ఏజెన్సీ అందించనుంది. ఈ జెండా ధరను రూ. 38గా నిర్ణయించారు. రైల్వే ఉద్యోగులు ఈ జెండాను డబ్బులు పెట్టి కొనుగోలు చేయబోరు. కానీ, ఈ డబ్బు మాత్రం వారి వేతనాల్లో కట్ చేసుకుంటారు. నార్త్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ఈ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించింది.

ఈ జెండాను రైల్వే ఉద్యోగులకు ఎంప్లాయీస్ బెనిఫిట్ ఫండ్ కింద అందిస్తారని, ఆ డబ్బును చివరకు వారి సాలరీల నుంచి ఎంప్లాయీస్ బెనిఫిట్ ఫండ్‌కు బదిలీ చేస్తారని డివిజనల్ మినిస్టర్ చందన్ సింగ్ తెలిపారు. కాబట్టి, ఆ డబ్బును తమ వేతనాల నుంచి కట్ చేయవద్దని కోరారు.