ఏపీలో రూ.4.76కోట్లు పట్టివేత..ఎక్కడంటే? - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో రూ.4.76కోట్లు పట్టివేత..ఎక్కడంటే?

April 1, 2022

bus

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా నగదు పట్టుబడిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..” ఓ ప్రైవేట్ బస్సులో తనిఖీలు నిర్వహించగా రూ. 4కోట్లకు పైగా నగదు పట్టుబడింది. విజయనగరం నుంచి గుంటూరు వెళ్తున్న పద్మావతి ట్రావెల్స్‌కు చెందిన ఏపీ 89 టీబీ 7555 నంబరు గల బస్సులో తనిఖీలు నిర్వహించాం. దీంతో బస్సు సీట్ల కింద లగేజ్ క్యారియర్‌ బ్యాగు ఉండడంతో అనుమానం వచ్చి, బ్యాగును చెక్ చేయగా.. భారీగా నగదు పట్టుబడింది.

అంతేకాకుండా పట్టుబడిని భారీ నగదుకు ఎలాంటి ఆధారాలు గాని, పత్రాలు గాని లేకపోవడంతో బస్సు డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించాం. అనంతరం బస్సులో తరలిస్తున్న నగదును0 లెక్కించగా రూ. 4. 70కోట్లు ఉన్నాయి. దీంతో పాటు 850 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాం” అని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో డ్రైవర్, క్లీనర్‌తో పాటు మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.