కాశీ యాత్రకు రూ. 5 వేల ప్రభుత్వ సబ్సిడీ.. - MicTv.in - Telugu News
mictv telugu

కాశీ యాత్రకు రూ. 5 వేల ప్రభుత్వ సబ్సిడీ..

March 5, 2022

6

కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో హిందువులకు పలు వరాలు ప్రకటించింది. హిందువులు పవిత్రంగా భావించే కాశీ యాత్రకు రూ. ఐదు వేల రాయితీని ప్రకటించింది. అలాగే, దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేసింది. గో సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. ‘ ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ తొలగించాలనే భక్తుల చిరకాల డిమాండ్‌ను నెరవేరుస్తున్నాం. దేవాదాయ శాఖలోనిదేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇస్తున్నాం. పశువధ నిరోధక బిల్లు ద్వారా ప్రతీ ఒక్కరు గోవులను దత్తత
తీసుకోవచ్చు. గోవులు వధశాలలకు తరలకుండా ఈ చట్టాన్ని తెచ్చా’మని తెలిపారు. కాగా, 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సాంప్రదాయ హిందూ ఓటు బ్యాంకును కాపాడుకునే ఉద్దేశ్యంతో హిందూ అనుకూల విధానాలు రూపొందిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. దీనికి ఉదాహరణగా కొద్ది కాలం క్రితం తెచ్చిన లవ్ జిహాద్ చట్టం కూడా అందులో భాగమేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.