షిప్‌యార్డ్ మృతులకు రూ.50 లక్షల పరిహారం.. - MicTv.in - Telugu News
mictv telugu

 షిప్‌యార్డ్ మృతులకు రూ.50 లక్షల పరిహారం..

August 2, 2020

Rs 50 Lakhs Ex Gratia For Vizag Crane Victims .

విశాఖపట్నం హిందూస్థాన్ షిప్ యార్డులో క్రేన్ కూలిన ఘటనలో మరణించిన వారికి ఏపీ ప్రభుత్వం భారీ నష్ట పరిహారాన్ని ప్రకటించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షల చొప్పున సాయం అందిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 

బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. హిందూస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్ ద్వారా అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

పరిహారంపై అధికారులు, కార్మికులతోనూ చర్చించిన తర్వాత భారీ మొత్తం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పర్మినెంటు ఉద్యోగులు ఉన్న కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు సంస్థల్లో శాశ్వత ఉపాధి కల్పిస్తామని చెప్పారు. కాగా నిన్నటి ప్రమాదంపై విచార‌ణ‌కు రెండు క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు జిల్లా కలెక్ట‌ర్ వినయ్‌ చంద్ ప్ర‌క‌టించారు. ఆంధ్రా యూనివ‌ర్సిటీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులతో ఒక‌టి, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ విభాగం మరో కమిటీ వేస్తామని చెప్పారు.