నిర్భయ దోషులు 6x8 అడుగుల గదుల్లో..  - MicTv.in - Telugu News
mictv telugu

నిర్భయ దోషులు 6×8 అడుగుల గదుల్లో.. 

January 25, 2020

Rs 50,000 being spent per day in security of Nirbhaya convicts.

దేశంలో తీహార్ జైలు ఎంత ప్రాధాన్యమైనది తెలిసిందే. ముఖ్యమైన కేసుల్లోని దోషులను ఈ జైలులో నిర్బంధిస్తారు. ఈ జైలులో మొత్తం 18,000 ఖైదీలు ఉన్నారు. సాధారణంగా జైలులో ఉన్న ఖైదీలలో టెర్రరిస్ట్ కార్యకలాపాల్లో పట్టుబడ్డ ఖైదీలకు, నేరాలకు పాల్పడిన రాజకీయ నాయకులకు భారీ భద్రతా కల్పిస్తారు. కానీ, తాజాగా ఫిబ్రవరి 1న ఉరితీయనున్న నిర్భయ దోషులు పవన్‌ కుమార్ గుప్తా (25), ముకేశ్‌ సింగ్‌ (32), అక్షయ్‌ ఠాకూర్‌ (31), వినయ్‌ శర్మ (26)లకు భారీ భద్రత కల్పించారు. 

నిర్భయ దోషులను జనవరి 16న జైలులోని మూడో నంబరు గదికి తరలించారు. 6X8 అడుగులున్న గదుల్లో ఒక్కొక్కరిని విడివిడిగా ఉంచారు. వారు ఆత్మహత్య చేసుకోకుండా నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ఆ జైలుగదిలో ఏ విధమైన రెయిలింగ్‌లు, రాడ్లు ఉండవు. వీరున్న ప్రతి జైలు గది దగ్గర ఇద్దరు గార్డ్‌లు 24 గంటలూ కాపలా ఉంటారు. గదుల్లో ఉన్న అటాచ్డ్‌ టాయిలెట్స్‌‌లో కూడా వారిపై నిఘా ఉంచేలా ఏర్పాట్లు చేశారు. వారి గదులను రోజుకు రెండు సార్లు గార్డులు పరిశీలిస్తారు. ఇవన్నీ కాకుండా ప్రతీ గదిలో రెండు సీసీ టీవీ కెమేరాలను ఏర్పాటు చేశారు. జైలు సూపరింటెండెంట్‌ ఆఫీస్‌లో ఉన్న కంట్రోల్‌ రూం నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. వీరి రక్షణ కొరకు రోజుకి రూ.50000 ఖర్చు చేస్తునట్టు సమాచారం.