Rs 600-cr Ganesh-shaped diamond is a big draw in Surat
mictv telugu

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వినాయక విగ్రహం.. విలువ రూ.600 కోట్లు

August 31, 2022

వినాయక చవితి సందర్భంగా దేశంలోని పలుచోట్ల వివిధ రూపాల్లో గణపతిని కొలుస్తున్నారు. భారీ సెట్టింగులతో , అత్యంత ఖరీదైన విగ్రహాలతో వినాయకుడిని పూజిస్తున్నారు. పలనాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో గణేషుడి ప్రతిమకు బంగారపు పూతతో ఉన్న లక్ష లక్ష్మీకాసులతో అలంకరణ చేసి పూజిస్తున్నారు. కెంపులు, పచ్చలు, అమెరికన్ వజ్రాలు అలంకరణకు ఉపయోగించారు. మరోవైపు యూపీలోని చందౌసీలో కరెన్సీ నోట్లతో , బంగారు పూతతో గణపతిని అర్చిస్తున్నారు. ముంబైలో సరస్వత్‌ బ్రాహ్మిణ్‌ సేవా మండల్‌ కూడా ఇదే తరహాలో అత్యంత ఖరీదైన గణపతిని ఏర్పాటు చేయిస్తోంది.గణపతి విగ్రహానికి ఏకంగా రూ.316.40 కోట్లకు ఇన్స్యూరెన్స్ కూడా చేయించారు.

ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రపంచంలోనే అరుదైన.. అత్యంత ఖరీదైన సహజ సిద్ధమైన గణపతి అందుకు ప్రత్యేకం. కోట్లు విలువజేసే ఈ సహజ వినాయక విగ్రహం డైమండ్ సిటీగా ఖ్యాతిగాంచిన గుజరాత్ లోని సూరత్ లో ఉంది. డైమండ్ సిటీగా ఖ్యాతిగాంచిన ఈ సిటీలో కొలువుదీరిన డైమండ్ గణపతిని భక్తులు దర్శనం చేసుకోవాలంటే ముందస్తుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. ఈ గణేశ విగ్రహం ఎక్కడ ఉందనేది కూడా అత్యంత రహస్యంగానే ఉంది ఎందుకంటే ఇది గణేశుడి ఆకారంలో ఉన్న సహజసిద్ధమైన వజ్రం.

అయితే సూరత్లోని వజ్రాల వ్యాపారి కనుభాయ్ బెల్జియం నుంచి ఓ విగ్రహం తీసుకువచ్చారు. అది వినాయకుడి విగ్రహం చూడటానికి చిన్నగా ఉన్నా ఖరీదైనది. 182.53 క్యారెట్ల వజ్రంలో గణేశుని రూపం స్పష్టంగా కనిపిస్తుంది. బెల్జియం వజ్రాల గనిలో నుండి బయటకు వచ్చిన ఈ వజ్రంలో గణేష్ తొండం, చేతులు, కళ్ళు, కాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. 82.53 క్యారెట్ రఫ్ డైమండ్ ఆఫ్రికాలో గనుల నుంచి బయల్పడింది. పసుపు బూడిద రంగు వజ్రం దాదాపు 48 mm ఎత్తు, 32 mm వెడల్పు , 20mm మందంతో ఉంటుంది. దీని బరువు 36.50 గ్రాములు. అందుకే ఇది ప్రపంచంలో చాలా అరుదైనది గా చెబుతారు దీని విలువ సుమారు 600 కోట్లు ఉండచ్చట. ఈ వజ్రం ఆ వ్యాపారి దగ్గర ఉంటుంది. కేవలం పూజల సమయంలో మాత్రమే దీనిని తీస్తారు చాలా భద్రంగా దీనిని ఉంచుతారట.