రూ. 634కే ఎల్‌పీజీ సిలిండర్‌ - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 634కే ఎల్‌పీజీ సిలిండర్‌

March 14, 2022

hhtfh

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. రూ. 634కే ఎల్‌పీజీ సిలిండర్‌ను విక్రయిస్తున్నామని తెలిపింది. ద్రవ్యోల్బణం కారణంగా అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తక్కువ ఖర్చుతోనే గ్యాస్ సిలిండర్‌ను పొందే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తోంది.

అంతేకాకుండా కాంపోజిట్ సిలిండర్లు తక్కువ బరువు ఉంటాయి. అంటే 14 కిలోల ఖాళీ సిలిండర్ బరువు కంటే తక్కువ బరువులో ఉంటుంది. కేవలం ఒక్క చేతితో వీటిని తీసుకెళ్లవచ్చు. ఒక ప్రదేశం నుంచి మరొక చోటుకు అలవోకగా తీసుకెళ్లువచ్చు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

మరోపక్క మార్చి 1న ఎల్‌పీజీ సిలిండర్ ధరను పెంచిన సంగతి తెలిసిందే. గ్యాస్ కంపెనీలు కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ.105 పెంచగా.. ఇప్పుడు ఢీల్లీలో వాటి ధరలు రూ.2,012, ముంబైలో రూ.1,963, కోల్‌కతాలో రూ.2,095, ఇక తెలుగు రాష్ట్రాల్లో 14.2 కేజీల సిలిండర్ ధర దాదాపు రూ.960గా ఉన్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్సిస్తూ ఉంటాయి. సిలిండర్ ధరను తగ్గించడం లేదా పెంచడం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో స్థిరంగా కూడా కొనసాగిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, అలాగే అమెరికా డాలర్‌తో ఇండియన్ రూపాయి మారకపు విలువ వంటి పలు అంశాలు సిలిండర్ ధరను ప్రభావితం చేస్తుంటాయి.