పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆయన తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర సమన్వయ కర్తగా ఉన్నారు. ఆ హోదాలోనే తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. దీనికి మంచి స్పందన రావడంతో ఆయనకు పార్టీ ప్రమోషన్ ఇచ్చింది. ప్రవీణ్ కుమార్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ఇంచార్జీ, బీఎస్పీ ఎంపీ రాంజీ గౌతమన్ హాజరు కానున్నారు. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటించింది. కాగా, గురుకులాల విద్యార్ధులను అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభా పాటవాలను చూపించేలా ప్రవీణ్ కుమార్ చాలా కృషి చేశారు.