RS Praveen kumar slams Telangana cm kcr for encounters
mictv telugu

ఎన్‌కౌంటర్లు నేను చేయలే, కేసీఆర్ చేసిండు.. ఆర్ఎస్ ప్రవీణ్

November 22, 2022

RS Praveen kumar slams Telangana cm kcr for encounters

తెలంగాణ ఉద్యమ కాలంలో ఎంతోమంది విద్యార్థుల ప్రాణాలు కాపాడానని మాజీ ఐపీఎస్, తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ‘‘ప్రవీణ్ సార్ లేకపోతే మేం ఖతమైపోయేవాళ్లం అని టీఆర్ఎస్ నాయకులే చెప్పుకున్నారు’ అని ఆయన చెప్పారు. పోలీసు అధికారిగా పలు ఎన్‌కౌంటర్ల చేశారని తనపై ఉన్న ఆరోపణలను ఆయన గట్టిగా తోసిపుచ్చారు.

వందలాది మంది నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చానన్నారు. కేసీఆర్ హయాంలో ఎన్నో ఎన్‌కౌంటర్లు జరిగాయని, అయితే ఆయనను ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు. ‘‘మేం తప్పు చేసి ఉంటే మమ్మల్ని జైల్లో వేసేవాళ్లు కదా. కోవర్ట్ ఆపరేషన్లు, ఎన్‌కౌంటర్ల గురించే నన్నే ఎందుకు అడుగుతున్నారు?’’ అని అన్నారు. మైక్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేక రాజకీయ, సామాజిక అంశాలపై ముచ్చటించారు.