అక్కడ ఖైదీలే ఇడ్లీలు వడ్డిస్తారు..ధర కూడా ప్లేట్ రూ. 5  - MicTv.in - Telugu News
mictv telugu

అక్కడ ఖైదీలే ఇడ్లీలు వడ్డిస్తారు..ధర కూడా ప్లేట్ రూ. 5 

October 18, 2019

Rs5 Idli Prison Hotel in Mahabubnagar

ఎప్పుడూ ప్రశాతంగా కనిపించాల్సిన జైలు ప్రాంగణం అంతా హడావిడిగా కనిపిస్తోంది. వేడి వేడి ఇడ్లీలు అక్కడ వడ్డింంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. అటుగా వెళ్లేవారు ఏంటా అని చూస్తే అక్కడ కేవలం రూ. 5కు నాలుగు ఇడ్లీలు అని రాసి కనిపిస్తోంది. అది ఎక్కడో కాదు మహబూబ్‌నగర్ జిల్లా జైలు ప్రాంగణం. ఇక్కడ ఖైదీలతో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేశారు అధికారులు. ఖైదీలు చేస్తున్న ఈ ఇడ్లీలకు గిరాకీ రోజు రోజుకు పెరగడం విశేషం. 

చౌకధరతో పాటు మంచి రుచి అందిస్తుండటంతో అక్కడ తినే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. మూడు రోజుల క్రితం దీన్ని ప్రారంభించారు. తొలిరోజు 400 మంది టిఫిన్‌ చేయగా రోజు రోజుకు వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మూడో రోజు నాటికి ఏకంగా 1100 మంది టిఫిన్ తిన్నట్టు జైలు అధికారులు చెబుతున్నారు. ఇడ్లీ సెంటర్ ద్వారా ప్రతి రోజూ  రూ. 7 వేల నుంచి రూ. 9 వేల వరకు ఆదాయం రాగా రూ.3 వేల వరకు లాభం వస్తుందని చెబుతున్నారు. ఈ విధానం వల్ల ఖైదీలలో సత్ప్రవర్తనతో పాటు వారు బయటకు వెళ్లిన తర్వాత స్వతహాగా పని చేసుకొని జీవించేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు. ఏమైనా జైలు అధికారులు చేసిన పనికి పలువురి నుంచి ప్రశంసలు వస్తున్నాయి.