మోహన్ భగవత్… ఆర్ఎస్ఎస్ చీఫ్.. ఇప్పుడు ఈ సారు గారి గురించి ఎందుకంటార… ఏం లేదు మహారాష్ట్రలో ఉన్న శివసైనికులు మోహన్ భగవత్‌ను రాష్ట్రపతిని చేయాలని అడుగుతున్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే రాష్ట్రీయ సంఘ్ సేనాపతిని రాష్ట్రపతి అభ్యర్ధిగా సూచిస్తే తమకు ఎలాంటి అభ్యర్ధన ఉండదని ప్రకటన చేసిండు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ను చేయడం బీజేపీకి ఇష్టం లేకపోతే వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ను రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించాలని శివసైనికులు అంటున్నారు.
ఇది ఇలా ఉంటే శివసేన ప్రకటన చేసిన సమయంలో ఆర్ఎస్ఎస్ ఛీఫ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తో సమవేశంలో ఉండటం కొత్త చర్చకు దారి తీసింది. కావలనే మోహన్ భగవత్ శివసేనతో ఈ ప్రకటన చేయించి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీకి తన మనుసులోని మాటను ఉద్దవ్ థాక్రే నోటి నుండి వినిపించినట్టు తెలుస్తుంది.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గడువు జూలై 24న ముగుస్తుంది.