ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన.. దేశంలో కొత్తగా 5 యూనివర్సిటీల ఏర్పాటు - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన.. దేశంలో కొత్తగా 5 యూనివర్సిటీల ఏర్పాటు

September 27, 2022

భారతీయ మితవాద, హిందూ జాతీయవాద, స్వచ్ఛంద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మంగళవారం కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా సంస్థ తరపున ఐదు యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన విద్యాభారతి జాతీయ ఆర్గనైజింగ్ సెక్రెటరీ యతీంత్ర శర్మ హరిద్వార్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే బెంగళూరులో చాణక్య యూనివర్సిటీ ఉండగా, అందులో 200 మంది విద్యార్ధులు చేరేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

అస్సాంలోని గౌహతిలోనూ యూనివర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఉత్తర, దక్షిణ భారతదేశాలను కలుపుతూ ఈ వర్సిటీలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇందులో అన్ని వర్గాలకు సీట్లు ఇవ్వడంతో పాటు నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా సిలబస్ ఉంటుందని, మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్స్ ప్రాముఖ్యత, నైపుణ్యాలతో కూడిన విద్యను అందిస్తామని స్పష్టం చేసింది. కాగా, ఆర్ఎస్ఎస్ నిర్వహించే విద్యాసంస్థలలో ఇప్పటికే 29 వేల మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. ఇందులో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఉండడం గమనార్హం.