జైళ్లలో ఆవులు పెంచాలి.. ఆరెస్సెస్ చీఫ్ - MicTv.in - Telugu News
mictv telugu

జైళ్లలో ఆవులు పెంచాలి.. ఆరెస్సెస్ చీఫ్

December 8, 2019

Rss chief.

మన దేశంలోని అన్ని జైళ్లలో ఆవులను పెంచాలని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ చెప్పారు. వాటి పెంపకం ద్వారా ఖైదీల మసనులు పూవులంత మెత్తగా మారి, మానసిక పరివర్తన కలుగుతుందని, క్రూరత్వం తగ్గుతుందని సూచించారు. ఆయన పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో జైల్లో గోశాలల ఆవశ్యత గురించి వివరించారు. 

‘ఆవుల పెంపకం వల్ల ఖైదీల మానసిక స్థితిని మార్చవచ్చు. ఖైదీల మనసులు పువ్వుల్లా మారతాయి. కొందరు జైలర్లు నాకు దీన్ని సూచించారు. దేశంలోని అన్ని జైళ్లలో గోశాలలను ఏర్పాటు చేయాలి. వాటి ఏర్పాటుకు ముందు, తర్వాత ఖైదీల్లో వచ్చిన మార్పులను నమోదు చేసి, మానసిక నిపుణులతో శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలి. అన్ని జైళ్లలో మార్పులు వస్తే ఈ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేయొచ్చు.. ’ అని అన్నారు. ఆవుకు మన దేశ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యముందని, విదేశీయులు మాత్రం దాన్ని కేవలం ఒక సరుకుగా చూస్తారని అన్నారు. ‘విదేశీయులకు ఆవు అంటే పాలు, మాంసమే. కానీ, మన భారతీయులకు దానితో బలమైన మానసిక బంధం ఉంటుంది. ఆవును వ్యాపార వస్తువుగా చూడరు. ఆవు తల్లి లాంటిది. మనుషులకు రోగాలు రాకుండా చూస్తుంది’ అని చెప్పారు.