‘అఖండ భారత్‌’పై మోహన్ భగత్ కీలక వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

‘అఖండ భారత్‌’పై మోహన్ భగత్ కీలక వ్యాఖ్యలు

April 15, 2022

త్వరలో అఖండ భారత్ కల సాకారమవుతుందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగత్ జోస్యం చెప్పారు. ఇటీవల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అఖండ భారత్ కల 20 ఏళ్లలో సాధ్యపడుతుందని అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు స్వామి రవీంద్ర పూరి పేర్కొన్నారు. ఆయన మాటలతో తాను ఏకీభవిస్తున్నట్టు మోహన్ భగత్ పేర్కొన్నారు. అరబిందో, వివేకానంద చెప్పినట్టు శ్రీకృష్ణుడి కోరిక నెరవేరుతుందని తెలిపారు. ప్రస్తుతం మనం వెళ్తున్న వేగంతో 20 ఏళ్లు, ఇంకా వేగంగా అడుగులు వేస్తే సమయాన్ని సగానికి తగ్గించవచ్చని వెల్లడించారు. భారత్ లక్ష్యాన్ని ఎవరూ అడ్డుకోలేరనీ, గీతలో చెప్పినట్టు మంచిని కాపాడుతూనే దుష్ట సంహారం మర్చిపోకూడదని స్పష్టం చేశారు.