Home > రాజకీయం > యూపి సిఎం ఆదిత్యనాథ్ కు చెక్ పెడుతున్న ఆర్ఎస్ఎస్

యూపి సిఎం ఆదిత్యనాథ్ కు చెక్ పెడుతున్న ఆర్ఎస్ఎస్

అయ్యకు పెండ్లి సంబురం, అమ్మకు సవతి సంకటం అన్నట్టుంది ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరిస్థితి.

అతివాద హిందుత్వ చర్యలతో రోజు రోజుకు బలపడుతున్న హిందు యువ వాహిని తో ఏ రోజుకైనా తలనొప్పి తప్పదని స్వయం సేవక్ పెద్దలు భయపడుతున్నరు. గౌ రక్షక్, లవ్ జిహాద్ పనులతో హిందూ యువ వాహిని దిక్కు కొన్ని వర్గాలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారన్నది ఆర్ఎస్ఎస్ మాట. హిందుత్వ పేటెంట్ గంపగుత్తగా ఒక్క బీజేపీకి మాత్రమే దక్కాలన్న సంఘ్ మూల సూత్రాలకు ఇది వ్యతిరేకమన్నది ఆ పెద్దల బాధ. వీళ్లను ఇట్లనే వదిలేస్తే మహారాష్ట్రలో శివసేన లెక్క తమ భుజాలపై ఎక్కి కూర్చుంటారని బీజేపీ అధిష్టానం కూడా భావిస్తుంది.

అందుకే హిందు యువ వాహినిని రద్దు చేయాలని దాని అధ్యక్షుడు, యూపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పై ఆర్ఎస్ఎస్ ఒత్తిడి పెంచుతుంది. అందుకు అనుగుణంగానే ఈ నెల మొదటివారంలో జరిగిన బీజేపీ ఎక్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో యూపి బీజేపీ అధ్యక్షుడు, డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పరోక్షంగా హిందూ వాహినిని ఎత్తిపొడిచిండు.

ప్రభుత్వంలో బయటివాళ్లకు అనవసర ప్రాధాన్యం దక్కుతుందన్నాడు. బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా ఉండంగనే మౌర్య మాట్లాడిండంటే ఆ మాటలకు బీజేపీ అధిష్టానం పర్మిషన్ ఉందన్న చర్చ నడుస్తుంది. ఆ సమావేశంలోనే ఉన్న ఆదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ కామెంట్స్ పై అస్సలు మాట్లాడలేదు. కాని ఆ మీటింగ్ అయిన తెల్లారే ఓ ఆర్నెళ్ల పాటు హిందూ వాహిని సభ్యత్వాన్ని ఆపేస్తున్నట్టు ఆ సంస్థ జనరల్ సెక్రటరీ పికే మాల్ ప్రకటించిండు. ఈ స్టేట్ మెంట్ తో ఆర్ఎస్ఎస్ నారాజ్ అయింది.

మొత్తానికి రద్దు చేయకుండా ఈ బ్యాన్ ఏంటని ప్రశ్నించింది. కాని ఆదిత్యనాథ్ మాత్రం హిందూ వాహినిని వదులుకునేలా లేడు. ఎందుకంటే 1999 లోక్ సభ ఎన్నికల్లో 7 వేల ఓట్ల తేడాతో గెలిచిన ఆదిత్యనాథ్, 2004లో లక్షా 42 వేల ఓట్లు, 2009,2014 ఎన్నికల్లో మూడు లక్షల ఓట్ల మెజార్టీ సంపాదించిండంటే హిందూ యువ వాహినినే కారణం. అలాంటి సంస్థను రద్దు చేయమంటే చేస్తడా ఏంది.

HACK:

  • RSS to Counter UP Chief Minister Adityanath.

Updated : 24 May 2018 3:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top