ఆర్టీసీ కండక్టర్ కొత్త అవతారం.. కత్తెర చేతపట్టి  - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ కండక్టర్ కొత్త అవతారం.. కత్తెర చేతపట్టి 

November 12, 2019

టికెట్.. టికెట్.. అంటూ బస్సులో ప్రయాణికుల వద్ద డబ్బులు కలెక్ట్ చేయాల్సిన కండక్టర్ కత్తెర పట్టుకోవాల్సి వచ్చింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కోసం ఇలా కొత్త అవతారం ఎత్తాడు. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగాల్లో చేరేందుకు అవకాశం ఇచ్చినా ఉద్యమానికి కట్టుబడి తిరిగి విధుల్లో చేరకుండా అతడు ఇలా మరో వృత్తిని ఎంచుకున్నాడు. నిర్మల్ మండలంలోని రత్నాపూర్‌కు చెందిన బస్సు కండక్టర్ నయా కొలువు చేపట్టాడు. 

RTC Bus Conductor.

కండక్టర్ మహిపాల్‌ గతంలో సెలూన్‌ నిర్వహించేవాడు. 2009లో ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం రావడంతో ఆ వృత్తిని వదిలి పెట్టాడు. గతంలో వచ్చే జీతం అంతా ఖర్చులు, ఈఎంఐలు కట్టుకోవడానికే సరిపోయేది. తాజాగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడంతో కుటుంబ పోషణతో పాటు బ్యాంకులు అప్పులు చెల్లించడం ఇబ్బందిగా మారింది. ఇక మరోదారిలేక తాను గతంలో వదిలేసిన కత్తెరను మళ్లీ చేతపట్టాడు. అందరికి కటింగ్ చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తాను మరోపని అయినా చేసుకుంటా కానీ, సమ్మె వీడేది లేదంటూ స్పష్టం చేస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తనలాంటి ఎంతో మంది జీవనం