ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. డీజిల్ సెస్ పేరుతో ఈ చార్జీలను పెంచారు. పల్లెవెలుగు బస్సుల్లో రూ. 2, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ. 5, ఏసీ బస్సుల్లో రూ. 10 పెంచుతున్నట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పల్లెవెలుగు బస్సుల్లో ఇక నుంచి టిక్కెట్ ధర రూ. 10 ఉంటుందని ప్రకటించారు. పెరిగిన ధరలు రేపటినుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. తాజా పెంపు ద్వారా రూ. 720 కోట్లు ప్రజలపై భారం పడనుంది. కాగా 2019లో ఆర్టీసీ రేట్లు పెంచగా, మూడేళ్ల తర్వాత ఇప్పుడు పెంచారు.