ఆర్టీసీ బ‌స్సు బోల్తా.. మ‌హిళ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ బ‌స్సు బోల్తా.. మ‌హిళ మృతి

November 20, 2022

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వికారాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా మరో పదిమందికి గాయాలయ్యాయి. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వికారాబాద్ డిపోనకు చెందిన పల్లె వెలుగు బస్సు.. తాండూరు నుంచి వికారాబాద్ కు వస్తోంది. అనంతగిరి గుట్ట సమీపంలో ప్రమాదానికి గురైంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడి పోయింది.

ఈ ప్ర‌మాదంలో ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని డాక్టర్లు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకులు ఫెయిలవ్వడమే ప్రమాదానికి ప్రధాన కారణమని చెబుతున్నారు.