RTC bus hit a couple in Bethamcharla
mictv telugu

పారిపోయి మహిళ ప్రాణాలు తీసిన ఆర్టీసీ డ్రైవర్

November 21, 2022

ఏపీలో ఓ ఆర్టీసీ డ్రైవర్ ప్రమాదానికి కారణమై మహిళ ప్రాణాలు తీశాడు. అరగంటకు పైగా బస్సు టైరు మహిళ కాలుపైనే ఉండిపోవడంతో ఆమె నరకయాతన అనుభవించి ప్రాణాలు విడిచింది. మనసుల్ని కలిచివేసే ఈ సంఘటన నంద్యాల జిల్లా బేతంచర్లలో ఆదివారం జరిగింది. సి.బెళగల్ మండలం కృష్ణందొడ్డికి చెందిన గొల్ల మద్దిలేటి, గోవిందమ్మ దంపతులు బేతంచర్లలోని అయ్యలచెరువు వద్ద ఓ పరిశ్రమలో పని చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఇద్దరూ విధులు ముగించుకొని బైకుపై పట్టణంలోకి వస్తుండగా, కర్నూలు నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు టైరు గోవిందమ్మ కాలుపై ఉండిపోగా, డ్రైవరు పారిపోవడంతో బస్సును తీసేవారు లేక అరగంట పాటు అలాగే ఉండిపోయింది. అనంతరం గాయపడిన దంపతులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా, గోవిందమ్మ మరణించారు. బస్సును వెంటనే తీసి ఉంటే తన భార్య బతికేదని మద్దిలేటి ఆవేదన వ్యక్తం చేశారు.