చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - MicTv.in - Telugu News
mictv telugu

చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

October 24, 2019

RTC Bus  ....

తాత్కాలిక డ్రైవర్ల పుణ్యమా అని ప్రయాణికులు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. నైపుణ్యంలేని డ్రైవర్ల కారణంగా ప్రతిరోజూ ఏదో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా మోస్ర గండిలో చెట్ల పొదల్లోకి బాన్సువాడ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఒక్కసారిగా బస్సు దూసుకెళ్లడంతో ఓ వైపు ఒరిగింది. ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 

స్థానికుల సాయంతో బస్సులో ఉన్నవారిని మెల్లగా కిందకు దింపారు. ఈ ఘటనలో చిన్నపాటి గాయాలు మినహా అంతా సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటి నుంచి తాత్కాలిక డ్రైవర్లతో వాహనాలు నడుపుతున్నారు. చాలా చోట్ల అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో నైపుణ్యంలేని వారు డ్రైవర్లుగా వస్తున్నారు. దీంతో తరుచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల నిజామాబాద్ నుంచి కోరుట్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు పిట్స్ రావడంతో పొదల్లోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.