మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కండక్టర్ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కండక్టర్ మృతి

November 14, 2019

ఆర్టీసీ సమ్మెలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం రాదేమో అనే బెంగతో కండక్టర్ నాగేశ్వర్ రావు మరణించాడు. కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయిన ఆయన పిచ్చిగా ప్రవర్తించే వాడు. గురువారం ఉదయం కన్నుమూశాడు. ఆయన మరణంతో జోగిపేటలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిరసనకు సిద్ధమయ్యారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. నగేష్ స్వగ్రామం పాపన్న పేటకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Rtc Conductor.

నవంబర్ 5 న సీఎం కేసీఆర్ డెడ్ లైన్ వార్త విని అస్వస్థకు గురయ్యాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొన్ని రోజులుగా తనలో తానే మాట్లాడుకుంటూ ఉండేవాడు. టికెట్.. టికెట్ అంటూ అరిచేవాడు. అతని పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే అక్కడి అధికారులు సమ్మెలో ఉన్న కారణంగా చికిత్స చేసేందుకు నిరాకరించారు. దాంతో గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఉద్యోగం లేక పూట గడవటం కష్టంగా మారడంతోనాగేశ్వర్ రావు భార్య జోగిపేటలోని తన తల్లిగారి ఇంటికి తీసుకువచ్చింది.  ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది మరణించాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.