బంధువులని టికెట్ కొట్టని కండక్టర్..తోటి ప్రయాణికుల ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

బంధువులని టికెట్ కొట్టని కండక్టర్..తోటి ప్రయాణికుల ఆగ్రహం

November 28, 2019

ఆర్టీసీ బస్సు అంటే కొంత మంది తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు సొంత వాహనాల్లా మారిపోయాయి. తనిఖీలు చేసే వారులేక చాలా మంది ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది టికెట్‌పై ఎక్కవ ధర తీసుకుంటూ ఉంటే.. మరికొంత మంది సొంత బంధువులు, కుటుంబ సభ్యులను ఫ్రీగా ప్రయాణించేలా చేస్తున్నారు. తాజాగా కామారెడ్డిలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. దీంతో కండక్టర్ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Conductor..

కామారెడ్డి డిపోకు చెందిన బస్సు నిజాంసాగర్‌ నుంచి కామారెడ్డి వెళ్తుండగా ఇది జరిగింది. కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి బంధువులు బస్సు ఎక్కారు. వారి వద్ద అతను టికెట్ డబ్బులు తీసుకోకుండా ఉండిపోయాడు. దీన్ని గమనించిన తోటి ప్రయాణికులు కండక్టర్‌ను నిలదీశారు. వారు తమ బంధువులని అందుకే తీసుకునేది లేదని బుకాయించాడు. బస్సు మీ సొంతం కాదని అంతా ఆగ్రహం వ్యక్తం చేయడంతో చేసేదేమిలేక టికెట్ ఇచ్చాడు. ఈ ఘటనపై ప్రయాణికులు డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. తాత్కాలిక సిబ్బంది తీరు ఆర్టీసీకి మరింత నష్టాలు తెచ్చే విధంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.