గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

November 26, 2019

RTC driver passedaway of a heart attack.

ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించినా.. ఆ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. దీంతో మరో ఆర్టీసీ డ్రైవర్ బలయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలంలోని మంగల్‌పాడ్ గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రాజేందర్(56) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. సోమవారం గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. 

చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రాజేందర్ మంగళవారం మృతిచెందారని వైద్యులు వెల్లడించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురై గుండెపోటుకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేందర్ బోధన్ ఆర్టసీ డీపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.