ఆర్టీసీ సమ్మె..అశ్వత్థామ రెడ్డి అరెస్టు - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ సమ్మె..అశ్వత్థామ రెడ్డి అరెస్టు

October 18, 2019

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని ఈరోజు పోలీసులు అరెస్టు చేశారు. సుందరయ్య విజ్ఞానభవన్ వద్ద పార్కు వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 

aswathama reddy arrest.

ఆయనతోపాటు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సహ కన్వీనర్ రాజిరెడ్డి, వెంకన్నలను కూడా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం మొండి వైఖరని వీడి, కార్మికులతో చర్చలు జరపాలని కోరారు. ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలకు పిలుపునిచ్చాడు. సమ్మె విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.