అశ్వద్థామరెడ్డికి ఆర్టీసీ షాక్..షోకాజ్ నోటీసులు జారీ - MicTv.in - Telugu News
mictv telugu

అశ్వద్థామరెడ్డికి ఆర్టీసీ షాక్..షోకాజ్ నోటీసులు జారీ

February 3, 2020

hkkgk

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులతో సుధీర్ఘ కాలం సమ్మె చేయించిన అశ్వద్ధామ రెడ్డికి అధికారులు షాకిచ్చారు. విధులకు గైర్హాజరు అవుతున్నందుకు ఆయనకు యాజమాన్యం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎటువంటి అనుమతి లేకుండా సెలవుల్లో ఉన్నారని, ఈ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున అంతా కలిసి శ్రమించాల్సిన సమయంలో సెలవులు పెట్టడంపై యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది.

కాగా ఆర్టీసీ సమ్మె తర్వాత ఆయన తన విధులకు లాంగ్‌ లీవ్‌ పెట్టుకున్నారు. ఈ గడువు జనవరి 5న సమ్మె ముగియడంతో విధుల్లో చేరాల్సి ఉంది. కానీ సెలవులు ముగిసిన వెంటనే ఒకరోజు విధులకు వచ్చి ఆ వెంటనే మరో 6 నెలల కాలానికి సెలవులు కావాలని కోరారు. కానీ దీన్ని ఆర్టీసీ తిరస్కరించింది. అయినప్పటికీ ఆయన విధులకు రాకపోవడంతో షోకాజ్‌ నోటీస్‌ జారీచేశారు.