RTC special bus service to Mallela Tirdham
mictv telugu

పర్యాటకులకు గుడ్ న్యూస్.. మల్లెల తీర్ధానికి ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసు

July 14, 2022

నల్లమల అడవిలో ఉన్న మల్లెల తీర్ధం జలపాతాల అందాలను చూసే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రోజూ రెండు బస్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ఈ సర్వీసు రోజూ ఉదయం 7.30 గంటలకు బయల్దేరుతుంది. ప్రయాణీకులను జలపాతం వద్ద దింపి తిరిగి 8.30 గంటలకు అచ్చంపేట బయల్దేరుతుంది. తిరిగి సాయంత్రం 4 గంటలకు మల్లెల తీర్ధం వెళ్లి, 5.30 గంటలకు అచ్చంపేట బయల్దేరుతుంది. అచ్చంపేట నుంచి మల్లెల తీర్ధం 55 కిలోమీటర్లు, హైదరాబాదు నుంచి 173 కిలోమీటర్ల దూరం ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఈ జలపాతాలు ప్రస్తుతం కురిసిన వర్షాలతో కొత్త సొగసులతో అలరిస్తోంది.