ఉద్రిక్తత.. అశ్వత్థామ రెడ్డి దీక్ష భగ్నం..  - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్రిక్తత.. అశ్వత్థామ రెడ్డి దీక్ష భగ్నం.. 

November 17, 2019

ఊహించిందే జరిగింది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తీవ్ర ఉద్ర్రిక్తత మధ్య ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులు, కార్మికుల మధ్య ఘర్షణ జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన నిన్న ఉదయం నుంచి తన ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. 

Rtc strike

ఆరోగ్యం క్షీణించిందని, దీక్ష మానాలని వైద్యులు చెప్పారు. దీనికి అశ్వత్థామ అంగీకరించలేదు. దీంతో పోలీసులు బీఎన్ రెడ్డి నగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనను బలవంతగా బయటికి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అయినా తాను దీక్ష కొనసాగిస్తానని అశ్వత్థామ స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డి దీక్షను కూడా పోలీసులు భగ్నం చేశారు. ఎల్బీనగర్‌లోని ఆయన ఇంటికెళ్లి తాళం పగలగొట్టారు. రాజిరెడ్డితోపాటు, ఆయన కుటుంబ సభ్యులను కూడా  అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టులను కార్మిక నేతలు తీవ్రం ఖండిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె ఈ రోజు 47వ రోజుకు చేరింది. కార్మికులతో చర్చించే ప్రసక్తే లేని ఆర్టీసీ యాజమాన్యం అంటోంది.