RTC travel free for women for two days: Yogi
mictv telugu

రాఖీ సందర్భంగా మహిళలకు యోగీ బంపర్ ఆఫర్.. రెండ్రోజులు ఫ్రీ

August 6, 2022

అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా భావించే రాఖీ పండుగ సందర్భంగా యూపీ సీఎం యోగా ఆదిత్యనాథ్ మహిళలకు సూపర్ ఆఫర్ ప్రకటించారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటన చేశారు. ఈ ఆఫర్ ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి నుంచి 12వ తేదీ అర్ధరాత్రి వరకు ఉంటుందని తెలిపారు. ఈ రెండు రోజుల పాటు మహిళలు ప్రయాణించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు యోగీ కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కాగా, ప్రతీ పండుగకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఏదో ఒక ఆఫర్ ఇస్తూ ప్రయాణికులకు ఆర్టీసీని దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. మరి ఈ రాఖీ పండుగకు ఆయన నుంచి ఎలాంటి ఆఫర్ వస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.