అసలు మోదీ భారతీయుడేనా?.. ఆర్టీఐ దరఖాస్తు - MicTv.in - Telugu News
mictv telugu

అసలు మోదీ భారతీయుడేనా?.. ఆర్టీఐ దరఖాస్తు

January 17, 2020

PM Modi.

కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తోపాటు ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లు కలకలం రేపుతున్నాయి. ముస్లింల పౌరసత్వాన్ని తొలగించేందుకే వీటిని తీసుకొచ్చారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అసలు భారతీయుడేనా? అని  ప్రశ్నిస్తూ కేరళలో సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు దాఖలైంది. ఆయన భారత పౌరుడేనా? అయితే నిరూపించుకోవాల్సిందే అని దరఖాస్తుదారు ప్రశ్నించారు.

కేరళలోని త్రిసూర్ జిల్లా, చలకుడి పట్టణానికి చెందిన జోష్ కల్లువీట్టిల్ ఈ దరఖాస్తు చేశారు. ఈ నెల 13న చలకుడి పురపాలక సంఘ ప్రజా సమాచార అధికారికి తన దరఖాస్తును అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ పౌరుడు అని నిరూపించే దస్తావేజులను అందజేయాలని పేర్కొన్నారు.