ఆర్టిఐ  చీఫ్ కమీషనర్ గా సదారం, కమీషనర్ గా బుద్దా మురళి..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టిఐ  చీఫ్ కమీషనర్ గా సదారం, కమీషనర్ గా బుద్దా మురళి..!

September 15, 2017

సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ)  చీఫ్ కమీషనర్ గా  రాజా సదారం నియమితులయ్యారు. రాజా సదారం గతంలో  అసెంబ్లీ కార్యదర్శిగా చాలాకాలం పనిచేశారు.అయితే ఆయన పదవీ కాలం ఇటీవలే ముగియడంతో  ప్రభుత్వం  కొంతకాలం ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. ఆతర్వాత ఆయన రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఆర్టిఐ ప్రధాన కమీషనర్ గా నియమకమయ్యారు.

ఇకపోతే  ఆర్టిఐ కమీషనర్ గా గా బుద్దా మురళి నియమితులయ్యారు. ఈయన గత ముప్పై సంవత్సరాలుగా ఆంధ్రభూమి పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేశారు. మెదక్ ,నల్లగొండ ,వరంగల్ ,మహబూబ్ నగర్ హైద్రాబాద్ జిల్లాల్లో రిపోర్టర్ గా పనిచేసారు. రాజకీయ పరిణామాలపై కొన్ని వందల వ్యాసాలు రాసారు.  ప్రభుత్వం పంపిన 28 అప్లికేషన్లలో సమాచర హక్కు కమిటి…అప్లికేషన్లను పరిశీలించి  వీళ్ల రెండు పేర్లను ఖరారు చేసారు. త్వరలోనే మిగతా అప్లికేషన్లను పరిశీలించి  మిగతా నియామకాలపై  నిర్ణయం తీసుకుంటామని కమిటీ చెప్పింది.