రూ. 12 లక్షలు చెత్తకుండీలో పడేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 12 లక్షలు చెత్తకుండీలో పడేశాడు..

January 31, 2018

పొరపాట్లు మానవ సహజం. డబ్బుల విషయంలో చాలామంది జాగ్రత్తగా ఉంటారుగాని.. ఒక్కొక్కప్పుడు వాటి విషయంలోనూ నాలిక్కరచుకుంటుంటారు. చైనా ఒక వ్యక్తి చెత్త అనుకుని రూ. 12 లక్షల డబ్బున్న సంచిని చెత్తకుండీలో పడేసిపోయాడు.లియోనింగ్‌ ప్రాంతానికి చెందిన వాంగ్‌  వ్యక్తి  ఇటీవల బ్యాంకులో డిపాజిట్ చేయడానికి 124,000 యువాన్లు (రూ.12 లక్షలు) తీసుకెళ్లాడు ఒక సంచిలో వేసుకుని. మరో చేత్తో చెత్త కవర్ తీసుకెళ్లాడు దారిలో చెత్తకుండీలో పడేయడానికి. అయితే లేచిన వేళావిశేషం ఏమిటోగాని.. చెత్త కవర్ అనుకుని డబ్బు సంచిని చెత్తకుండీలో వేసి బ్యాంకుకు వెళ్లాడు. డిపాజిట్ చేయడానికని సంచిలో చేయిపెట్టగా చెత్త తగిలింది. లబోదిబోమంటూ పరుగుపరుగునా చెత్తకుండీ వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే డబ్బు కవర్‌ను ఎవరో తీసుకెళ్లారు.

ఆ కవర్ ఓ యువతికి దొరికింది. ఆమె దాన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది. వాంగ్ పోలీసుల వద్దకెళ్లి ఫిర్యాదు చేయడంతో వారు అతనికి డబ్బు సంచి అందించి క్లాస్ పీకారు. నిజాయతీతో డబ్బు అందించిన యువతికి వాంగగ్ రూ. 2000 నజరానా అందించాడు.