రూల్ అంటే రూలే.. భారీ జరిమాన కట్టిన దేశాధ్యక్షుడు - MicTv.in - Telugu News
mictv telugu

రూల్ అంటే రూలే.. భారీ జరిమాన కట్టిన దేశాధ్యక్షుడు

May 24, 2022

అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బెర్టో ఫెర్నాండేజ్, అతని భార్య ఫాబియోలా యేనెజ్‌ న్యాయస్థానం వెలువరించిన తీర్పును గౌరవించి భారీ జరిమానాను కట్టారు. ఇద్దరూ కలిసి 24వేల డాలర్ల (అంటే దాదాపు 18.63 లక్షలు)ను వ్యాక్సిన్ రీసెర్చ్ సెంటర్‌కు అందించారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడి మీడియాలు అధ్యక్షుడు ఆల్బెర్టో ఫెర్నాండేజ్ బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని జరిమానాను కట్టినట్లు పేర్కొన్నాయి. ఇంతకి ఎందుకంత జరిమానాను దేశ అధ్యక్షుడు కట్టారు? కోర్టు ఎందుకు దేశ అధ్యక్షుడిపై మండిపడింది? అనే వివరాల్లోకి వెళ్తే.. కరోనా విజృంభిస్తున్న సమయంలో అర్జెంటీనా వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఈ క్రమంలో 2020 జులైలో అధ్యక్షుడు ఆల్బెర్టో ఫెర్నాండేజ్, అతని భార్య ఫాబియోలా యేనెజ్‌లు రూల్స్‌ను బ్రేక్ చేసి, ఘనంగా బర్త్ డే పార్టీ చేసుకున్నారు. దాంతో ఆ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలో ఆ పార్టీపై అర్జెంటీనా ఫెడరల్ కోర్టు తీవ్రంగా మండిపడింది. ఇటీవలే పార్టీపై విచారణ జరిపిన కోర్టు.. భారీ జరిమానాను విధించింది. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ..” ఆ పార్టీ వెనుక ఎలాంటి హానికర ఉద్దేశాలు లేవు. అది కేవలం నా నిర్లక్ష్యం వల్లే జరిగింది. మమ్మల్ని క్షమించండి’ అని వేడుకున్నాడు. దాంతో కోర్టు అధ్యక్షుడికి 1.6 మిలియన్ పోసెస్‌లు, మొదటి మహిళకు 1.4 మిలియన్ పోసెస్‌ల జరిమానా విధించింది. ఆ డబ్బులను ఇద్దరూ మాల్‌బ్రాన్ వ్యాక్సిన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు విరాళంగా అందించాలని ఆదేశించింది.