ఝాన్సీకి కరోనా అని ప్రచారంలో నిజమెంత! - MicTv.in - Telugu News
mictv telugu

ఝాన్సీకి కరోనా అని ప్రచారంలో నిజమెంత!

July 5, 2020

mnvhmvgh

కరోనా వైరస్ తో పాటు సోషల్ మీడియాలో నకిలీ వార్తలు కూడా వ్యాపిస్తున్నాయి. కొందరు సినిమా సెలెబ్రెటీలకు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా నటి, యాంకర్ ఝాన్సీకి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యిందని ప్రచారం జరిగింది. ఆమె నిర్వహించిన పరివార్ సీజన్ 2 షూటింగ్ సందర్బంగా పాజిటివ్ ఉన్న వారితో కాంటాక్ట్ అవ్వడం వల్ల ఆమెకు కూడా పాజిటివ్ వచ్చిందనేది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

దీనిపై ఆమె ఘాటుగా స్పందించారు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. తప్పుడు ప్రచారాల గురించి మాట్లాడేవారెవరు నాకు కాల్ చేయోద్దు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఆపేయండి. నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. షూటింగ్స్ జరుగుతున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్క్ ధరించడం పీపీఈ కిట్స్ ను ధరించడం మంచిదంటూ ఆమె సూచించారు.