జబర్దస్త్ లో ఎపిక్ పంచ్ డైలాగ్స్ తో ఫెమస్ అయిన హాస్యనటుడు రచ్చ రవి గురించి గత 24గంటలుగా ఒక షాకింగ్ వార్త వైరల్ అవుతుంది.
ఇప్పటికే తారకరత్న విషమ పరిస్థితితో ఆందోళనలో ఉన్న టాలీవుడ్ లో మరో విషాదం అంటూ రచ్చ రవిపై వార్తలు వస్తున్నాయి. రచ్చ రవి కారు ప్రమాదానికి గురయ్యాడని.. ఆక్సిడెంట్ లో అతనికి తీవ్ర గాయాలయ్యాయని.. దీంతో అతని పరిస్థితి విషమంగా ఉందని ఇంటర్నెట్‌లో పుకార్లు వ్యాపించాయి. అయితే నిజం భిన్నంగా ఉంది. తన విషమ పరిస్థితి వార్తలపై రచ్చ రవి క్లారిటీ ఇచ్చాడు.
సూర్యపేట, మునగాల వద్ద రచ్చ రవికి యాక్సిడెంట్ జరిగిందని.. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడని వార్తలు రాగా.. తాజాగా వీటిని రచ్చ రవి కొట్టిపారేశాడు. తాను క్షేమంగా ఉన్నానని, తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తాను పుణెలో షూటింగ్ ముగించుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చానని.. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నాడు. పైగా తాను హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో వచ్చానని.. అందువల్ల తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపాడు. అంతేకాక శనివారం జరగబోయే వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌కి కూడా హజరవుతున్నట్లు వెల్లడించాడు రచ్చ రవి.
ఇవి కూడా చదవండి :
బెంగుళూరుకి ఎన్టీఆర్.. తారకరత్న పరిస్థితి విషమం ?
సూర్య డబ్బింగ్ ఆర్టిస్ట్.. శ్రీనివాస మూర్తి మృతిలో షాకింగ్ ట్విస్ట్..!