భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై మొదటి టెస్ట్‌లో సెంచరీతో అలరించాడు. బ్యాటింగ్ ప్రతికూలంగా ఉన్న పిచ్‌పై శైలికి భిన్నంగా ఆడి శతకం సాధించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసి జట్టును ఆదుకున్నాడు. రవీండ్ర జడేజాతో బలమైన పునాది వేసి భారత్‌ను పటిష్టస్థితిలో నిలిపాడు. రెండేళ్ళ తర్వాత టెస్ట్ సెంచరీ సాధించిన రోహిత్ ఓ అరుదైన రికార్డును కూడా అందుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో శతకాలు సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇక రోహిత్ శర్మ బ్యాటింగ్‌పై బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రశంసల జల్లు కురిపించాడు.
హిట్ మ్యాన్ కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన సెంచరి అనీ కొనియాడాడు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై సెంచరీ చేయడం అంత సులువైన పనికాదని, తన శైలికి భిన్నంగా ఆడి రోహిత్ శతకం సాధించాడని విక్రమ్ రాథోడ్ అభిప్రాయపడ్డాడు. ఎట్టకేలకు ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడని తెలిపాడు. రోహిత్ బెస్ట్ మూడు సెంచరీలలో ఈ సెంచరీ ఉంటుందని విక్రమ్ రాథోడ్ పేర్కొన్నాడు. “చెపాక్ స్టేడియంలో 161 పరుగులు, ఓవల్ మైదానంలో సెంచరీ, నాగూపూర్ పై తాజాగా చేసిన శతకం హైలైట్. నెట్స్‌లో శ్రమించడం ద్వారానే మ్యాచ్‌లో రోహిత్ రాణించాడు. ఇక వరుసుగా విఫలమవుతున్న రాహుల్ కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. విరాట్, రోహిత్‌లా రాహుల్ కూడా టాలెంట్ ప్లేయర్.తొందరలోనే అతడు ఫామ్ అందిపుచ్చుకుంటాడు” అని విక్రమ్ రాథోడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.