లైవ్‌లో మహిళా జర్నలిస్టుపై యూత్ లీడర్ అసభ్య ప్రవర్తన - MicTv.in - Telugu News
mictv telugu

లైవ్‌లో మహిళా జర్నలిస్టుపై యూత్ లీడర్ అసభ్య ప్రవర్తన

December 12, 2019

Runner Slapped.

మీడియా ప్రతినిధులు కవరేజ్ కోసం వెళ్లినప్పుడు స్థానికలు హడావిడి మామూలుగా ఉండదు. ఎలాగైనా తాము కూడా లైవ్‌లో కనిపించాలని వింత వింత చేష్టలు చేస్తుంటారు. కొన్నిసార్లు కెమెరాలకు కూడా అడ్డుపడుతూ ఉంటారు. వీటన్నింటిని అదిగమించి రిపోర్టింగ్ ఇస్తూ ఉంటారు. కానీ జార్జియాలో ఓ మహిళా జర్నలిస్టుకు ఎదురైన చేదు అనుభవం అందరిని విస్మయానికి గురి చేసింది. ఓ లేడీ రిపోర్టర్ పట్ల ఓ యువకుడి తీరు విమర్శలకు దారి తీసింది. 

జార్జియాలో జరిగిన 10కే రన్ కవరేజీ కోసం డబ్ల్యూఎస్ఎవీ-టీవీ తన రిపోర్టర్‌‌ను పంపించింది. అక్కడికి వెళ్లిన అలెక్స్ బోజార్జియన్‌ రన్‌పై లైవ్ రిపోర్టింగ్ ఇస్తోంది. ఆ సమయంలో పరిగెత్తుకుంటూ వచ్చిన వారు కెమెరాకు అడ్డు తగలడం.. ఆమెకు దగ్గరగా రావడం లాంటివి చేశారు. అయినా వాటిని పట్టించుకోలేదు.

కానీ ఓ వ్యక్తి మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి వెనుకవైపు కొట్టడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ చర్యతో అలెక్స్‌కు కొద్దిసేపు నోటమాట రాలేదు. ఆ తరువాత తెరుకొని యధావిధిగా రిపోర్టింగ్ చేశారు. ఈ తతంగం అంతా వీడియోలో రికార్డు అయింది. దీనిపై స్పందించిన ఆమె ఆ వ్యక్తి తీరును ఎండగట్టారు. అతడు చేసిన పని తనను శారీరకంగా, మానసికంగా బాధించిందని పేర్కొన్నారు. వీడియో ఆధారంగా  స్టాతెస్బోరో యూత్ లీడర్ టామీ కాల్వేగా గుర్తించారు.

స్థానిక యూత్ లీడర్‌గా ఇతడు పనిచేస్తున్నాడు. ఇటువంటి వ్యక్తి తప్పుగా ప్రవర్తించడంపై విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో అతన్ని రన్నింగ్ ఈ వెంట్ల నుంచి బహిష్కరించారు. అయితే ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదని టామి కాల్వే చెబుతున్నాడు. దీనిపై ఆమెకు క్షమాపన కూడా చెబుతున్నట్టు ప్రకటించాడు.ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా అతని తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.