టెన్షన్‌తోనే ఇంటికి పరుగెత్తా.. అజ్ఞాతం వీడిన రాజ్ తరుణ్.. - MicTv.in - Telugu News
mictv telugu

టెన్షన్‌తోనే ఇంటికి పరుగెత్తా.. అజ్ఞాతం వీడిన రాజ్ తరుణ్..

August 21, 2019

నార్సింగి వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో టాలీవుడ్ కుర్ర హీరో రాజ్ తరుణ్ కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇంతవరకు రాజ్ తరుణ్ మీడియా ముందుకు రాకుండా అజ్ఞాతంలో వుండిపోయాడు. అయితే తాజాగా నార్సింగి రోడ్డు ప్రమాదంపై రాజ్ తరుణ్ స్పందించాడు. కారు ప్రమాదం అనంతరం తాను అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నానని ట్విటర్ వేదికగా చెప్పాడు. తన యోగక్షేమాలు తెలుసుకోవడానికి చాలామంది ఫోన్లు చేస్తున్నారనీ, ఇంతమంది ప్రేమను పొందినందుకు తాను అదృష్టవంతుడినని పేర్కొన్నాడు. 

‘నార్సింగి సర్కిల్‌కు రాగానే కారు కుడివైపు మలుపు తీసుకోవాల్సి వచ్చింది. కారు మలిపే క్రమంలో అదుపుతప్పింది. ఒక్కసారిగా వెళ్లి పక్కనే వున్న గోడను బలంగా ఢీకొట్టింది. దీంతో భారీ శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి నా చెవులు పనిచేయలేవు. చూపు కూడా కోల్పోయినట్టు అనిపించింది. గుండెలో దడ పెరిగింది. నేనప్పుడు సీటు బెల్టు ధరించే వున్నాను. నాకు దెబ్బలేమీ తగలలేదని నిర్ధారించుకున్నాక కారు నుంచి బయటపడ్డాను. ఆ ఆందోళనలో ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆరోజు రాత్రి జరిగింది ఇదే. మిగిలిన విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి. త్వరలోనే మళ్లీ సినిమా షూటింగులో పాల్గొంటాను. మీరు నాపట్ల చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు చెబుతున్నా. ఇంకొక విషయం చెబుతున్నా.. సీటు బెల్టే ప్రమాదం నుంచి నన్ను కాపాడింది. సీటు బెల్టు అందరూ ధరించాలి’ అని రాజ్ తరుణ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. నార్సింగి సర్కిల్‌లో గత 3 నెలలుగా చాలా ప్రమాదాలు జరిగాయని రాజ్ తరుణ్ గుర్తుచేశాడు.