ప్రపంచంలో తొలి మహిళా అనస్తీషియాలజిస్ట్ హైదరాబాదీనే - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలో తొలి మహిళా అనస్తీషియాలజిస్ట్ హైదరాబాదీనే

March 14, 2019

రొనాల్డ్ రాస్ పేరు వినే ఉంటారు. మలేరియా కారక పరాన్నజీవిపై అధ్యయనానికిగాను ఆయనకు 1902లో నెబెల్ బహుహతి వచ్చింది. హైదరాబాద్‌లోనే ఆయన పరిశోధనలు చేశారు. నాటి హైదరాబాద్ నగరంలో పలువురు విద్యావంతులు తాము ఎంచుకున్న రంగాల్లో విస్తృత అధ్యయనం చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో డాక్టర్ రూపా బాయి ఫర్దూన్జీ ఒకరు. ప్రపంచంలోనే తొలి అనస్తీషియాలజిస్టుగా చరిత్ర సృష్టించారు ఆమె.

రూపా బాయి హైదరాబాద్ మెడికల్ స్కూల్లో(నేటి ఉస్మానియా మెడికల్ కాలేజీ) చదువుకున్నారు. సర్జన్ ఎడ్వర్డ్ లారీ ప్రోత్సాంతో రూపతోపాటు పలువురు హైదరాబాదీ మహిళలు మెడికల్ కోర్సుల్లో చేరారు. రూప 1885లో హైదరాబాద్ మెడికల్ స్కూల్లో చేరి, 1889లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అనాటమీ, ఫిజియాలజీ, మెటీరియా మెడికా, మెడిసిన్, సర్జనీ, మిడ్ వైఫరీ తెలుసుకున్నారు. 1889 నుంచి 1917వరకు సుల్తాన్ బజార్ లోని బ్రిటిష్ రెసిడెన్సీ హాస్పిటల్, అఫ్జల్ గంజ్ హాస్పిటల్, జరీనా హాస్పిటల్లో అనస్తియాలజిస్టుగా పనిచేశారు. ఈ మధ్య కాలంలో పై చదువుల కోసం బ్రిటన్ వెళ్లారు. ఎడిన్ బర్గ్ వర్సిటీలో ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో డిప్లమా చేశారు. తర్వాత అమెరికా వెళ్లి బాల్టిమోర్‌లోని జాన్ హాప్కిన్స్ హాస్పిట్లలో మెడికల్ డిగ్రీ చదివారు. తర్వాత నిజాం మెడికల్ సర్వీస్ లో చేరి సూపరింటెండెంట్ గా పదవీ విరమణ చేశారు.మగవాళ్లక మాత్రమే పరిమైతన అనస్తీషియాలో ఆమె అప్పట్లో ప్రతిభ కనబరిచి ప్రశంసంలు అందుకున్నారు. భారత్‌లో క్లోరోఫామ్ వాడకం విస్తృతం కావడం వెనుక ఆమె కృష్టి ఉంది. అయితే ఆమె మలి జీవితం గురించి చరిత్రలో పెద్దగా రికార్డు కాకపోవడం విషాదం. ఆమె అవివాహితగానే ఉండిపోయినట్లు తెలుస్తోంది.