Rupee depreciates against dollar
mictv telugu

ఘోరంగా దిగజారిపోయిన రూపాయి.. రూ.80 లోకి ప్రవేశం

June 29, 2022

Rupee depreciates against dollar

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోంది. బుధవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి డాలరుతో రూపాయి విలువ జీవిత కాల కనిష్టం 79.04 కి పతనమైంది. అంతకుముందు రోజు మంగళవారం 48 పైసలు, బుధవారం 19 పైసలు క్షీణించడంతో కనిష్ట స్థాయికి దిగజారింది. విదేశీ పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణ, ముడి చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం వంటివి ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. రూపాయి విలువ పడిపోవడం వల్ల మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల రేట్లు పెరుగుతాయి.

ముడి చమురు, వంటనూనె, పప్పుదినుసులు వంటి వాటికి అధిక ధరలు చెల్లించాలి. అయితే విదేశాలకు ఎగుమతి చేసే వాళ్లకు ఈ పరిణామం లాభాలు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, ఫార్మా వంటి రంగాలు, విదేశాల నుంచి డబ్బు పంపేవారికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. సులువుగా చెప్పాలంటే దిగుమతులకు నష్టం, ఎగుమతులకు లాభం అని చెప్పవచ్చు. అయితే క్షీణతకు సంబంధించిన అంశాలు అంతర్జాతీయ పరిణామాలతో ముడిపడి ఉంటాయి కనుక మన ప్రభుత్వాల పాత్ర పరిమితంగా ఉంటుంది. కాకపోతే, నష్ట నివారణకు ఎలాంటి చర్యలు ఎంత వేగంగా తీసుకుంటున్నారన్నదే ముఖ్యం.