Rupee strengthened by 26 paise against the dollar
mictv telugu

డాలరుతో బలపడిన రూపాయి.. రూ. 79.65కి చేరిక

July 28, 2022

Rupee strengthened by 26 paise against the dollar

ఇటీవల ఆందోళనకు గురి చేసిన డాలరుతో రూపాయి మారకం విలువ గురువారం కాస్త పెరిగింది. రూపాయి 26 పైసలు బలపడి రూ. 79.65 వద్ద స్థిరపడింది. ఓవైపు స్టాక్ మార్కెట్లు పెరగడం, అదే క్రమంలో రూపాయి బలపడడం గమనార్హం.

అంతర్జాతీయంగా డాలరు బలహీనతకు తోడు దేశీయంగా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లడంతో ఆ పరిణామం చోటుచేసుకుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే చమురు ధరలు పెరగడం వల్ల రూపాయి మరింత బలపడకుండా ఆగింది. మరికొన్ని రోజులు రూపాయి మరింత బలపడే సంకేతాలు ఉన్నాయంటూ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేదీ పేర్కొన్నారు.