కాలుతూ ఒక్కసారిగా పేలిన పెట్రోల్ బంక్ (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

కాలుతూ ఒక్కసారిగా పేలిన పెట్రోల్ బంక్ (వీడియో)

August 11, 2020

Russia 12 injured in Volgograd petrol station explosion.

కరోనాతో సతమతం అవుతున్న సమయంలో వివిధ చోట్ల చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు మరింత కలవరపెడుతున్నాయి. మొన్న లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో జరిగిన భారీ పేలుడు ఘటనతో 160 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో కూడా స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు. ఆ ఘటనల గురించి మరిచిపోకముందే తాజాగా రష్యాలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో భారీ పేలుడు సంభవించింది. సోమవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుంది. 

వోల్గోగ్రాడ్‌ పెట్రోల్‌ స్టేషన్‌లో మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక దళం అక్కడకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంది. అంతలోనే మంటలు ఎక్కువై భారీ పేలుడు సంభవించింది. దీంతో పెట్రోల్‌ బంక్‌ నామరూపాల్లేకుండా పోయింది. పెట్రోల్‌ స్టేషన్‌కు సంబంధించిన పైప్‌లైన్లు కూడా పేలి పోవడంతో సుమారు 200 మీటర్ల మేర మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.