ట్విట్టర్, ఫేస్‌బుక్‌లపై నిషేధం విధించిన రష్యా - MicTv.in - Telugu News
mictv telugu

ట్విట్టర్, ఫేస్‌బుక్‌లపై నిషేధం విధించిన రష్యా

March 4, 2022

12

యూరప్, అమెరికాలు తమపై ఆర్థిక ఆంక్షలు విధించడంతో పాటు తమ దేశానికి చెందిన మీడియా సంస్థలను నిషేధించడంతో రష్యా ప్రతీకార చర్యలను చేపట్టింది. అందులో భాగంగా సోషల్ మీడియా దిగ్గజ సంస్థలైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను తమ దేశంలో నిషేధించింది. అంతేకాక, యాప్ స్టోర్‌తో పాటు బ్రిటన్‌కు చెందిన బీబీసీ మీడియా సంస్థను కూడా నిషేధిత జాబితాలో చేర్చింది. అంతకు ముందు రష్యన్ మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానళ్లకు గూగుల్ వాణిజ్య ప్రకటనలకు నిలిపివేసింది. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా కూడా అలాంటి నిర్ణయం తీసుకోవడంతో రష్యన్ మీడియా ఆదాయ వనరుల మీద తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు తనపై విధించిన ఆర్ధిక ఆంక్షలకు బదులుగా.. అమెరికాకు రాకెట్ ఇంజిన్ల సరఫరాను రష్యా నిలిపివేసింది. కౌరూ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి తన మానవ వనరులను, సాంకేతికతను వెనక్కి తీసుకుంది.