ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడి.. 300మంది మృతి! - MicTv.in - Telugu News
mictv telugu

ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడి.. 300మంది మృతి!

February 24, 2022

 

re save

అందరూ అనుకున్నదే జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నామంటూ రష్యా అధినేత పుతిన్ అధికారికంగా సంచలన ప్రకటన చేశారు. ప్రపంచ దేశాలు వద్దని కోరుతున్నా పుతిన్ పట్టించుకోకుండా యుద్ధానికే మొగ్గు చూపారు.గురువారం ఉదయం 6 గంటల నుంచి రష్యా యుద్దం చేయడం మొదలుపెట్టింది.

రష్యా ఇప్పటికే కేపిటల్‌ కీవ్‌తోపాటు 11 నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌ను మూడు వైపులా నుంచి చుట్టుముట్టి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను రష్యా సైన్యం చుట్టుముట్టింది. కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని బాంబుల మోత మోగిస్తోంది. మిలటరీ ఆపరేషన్‌కు దిగిన కొద్దిగంటల్లోనే ఉక్రెయిన్‌ కేపిటల్‌ కీవ్‌ను ఆక్రమించింది. మూడు వైపుల నుంచి ఉక్రెయిన్‌ను ముట్టడించింది. బెలారస్, క్రీమియా, లుహాన్స్‌ నుంచి ఉక్రెయిన్‌లోకి ఎంటరైన రష్యా బలగాలు, ఒకేసారి మూకుమ్మడి దాడికి పాల్పడంతో ఇప్పటికే 300 మంది పైగా మృతి చెందినట్లు సమాచారం.

మరోపక్క ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన పుతిన్, అమెరికా అండ్ నాటో కంట్రీస్‌కు డైరెక్ట్ వార్నింగ్‌ ఇచ్చారు. ఉక్రెయిన్‌ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ హెచ్చరించారు. ఎవరైనా జోక్యం చేసుకుంటే మాత్రం ప్రతీకారం తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. చరిత్రలో మీరు చూసిన పరిణామాలకు మిమ్మల్ని దారితీస్తుందని మేము ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించలేదని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌లో తమ ప్రణాళికలు ప్రత్యేక సైనిక చర్యలో ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.