Home > Featured > విదేశీ రుణ చెల్లింపుల్లో రష్యా విఫలం.. శతాబ్దం తర్వాత ఇదే తొలిసారి

విదేశీ రుణ చెల్లింపుల్లో రష్యా విఫలం.. శతాబ్దం తర్వాత ఇదే తొలిసారి

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. ఆంక్షల వల్ల రష్యా చెల్లించాల్సిన 100 మిలియన్ డాలర్లను చెల్లించలేకపోతోంది. ఈ పరిస్థితి రష్యాకు 104 ఏళ్ళ క్రితం వచ్చింది. అయితే ట్విస్ట్ ఏంటంటే, శ్రీలంక, పాకిస్తాన్ లాగా రష్యాకు నిధుల కొరత ఏమీ లేదు. నిధులున్నా అవి విదేశీ బ్యాంకులలో చిక్కుకోవడంతో ఆంక్షల కారణంగా వాటిని వినియోగించుకోలేకపోతోంది. మే 27న రష్యా 100 మిలియన్ డాలర్ల సొమ్మును యూరోక్లియర్ బ్యాంకుకు పంపింది. అయితే ఆంక్షల్లో భాగంగా ఆ డబ్బును పంపించలేమని బ్యాంకు వెల్లడించడంతో రష్యాకు ఇబ్బందికరంగా మారింది. దీనిపై రష్యా ఆర్ధిక మంత్రి మాట్లాడుతూ ‘మేం రుణాలను ఎగ్గొట్టడం లేదు. మా డబ్బు వారికి చేరడం లేదు’ అని వ్యాఖ్యానించారు.

Updated : 27 Jun 2022 2:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top